Homeజాతీయంసహజీవనంలో ఉండే మహిళలకూ గృహ హింస చట్టం వర్తింపు

సహజీవనంలో ఉండే మహిళలకూ గృహ హింస చట్టం వర్తింపు

- Advertisement -

కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
పెళ్లి చేసుకోకపోయినా, సహజీవనం సాగించే మహిళలపై జరిగే హింస కూడా తీవ్రమైనదేనని వ్యాఖ్య

సుప్రీంకోర్టు  వివాహంతో సమానమైన “లివ్‌-ఇన్ సంబంధాలలో ఉండే మహిళలకు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 498A కింద రక్షణ కల్పించకపోవడం వివక్షపూరితమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి సంబంధంతో సమానంగా, వివాహం చేసుకునే ఉద్దేశంతో కలిసి ఉంటున్న సహజీవనం సాగించే జంటల విషయంలోనూ ఈ చట్టం వర్తిస్తుందని సోమవారం (ఆగస్టు 3) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు లివ్‌-ఇన్ భాగస్వామిపై కూడా గృహ హింస, వేధింపుల కింద ప్రాసిక్యూషన్ కొనసాగించవచ్చని తేల్చిచెప్పింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మహిళకు, వివాహంతో సమానమైన లివ్‌-ఇన్ సంబంధంలో ఉన్న మహిళకు మధ్య గృహ హింస రక్షణ విషయంలో తేడా చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కు విరుద్ధమని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ నొంగ్మీకాపం కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. భర్త లేదా అతని బంధువుల వల్ల శారీరక, మానసిక వేధింపులకు గురయ్యే మహిళలకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A ముఖ్య ఉద్దేశమని, కేవలం పెళ్లి కాలేదన్న కారణంగా వేధింపులు నేరం కాదనడం అతి సరళీకృతం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. లివ్‌-ఇన్ సంబంధాలకు సెక్షన్ 498A వర్తించదని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వివాహాల రకం ఏదైనా సరే, మహిళలపై జరిగే గృహ హింస, వేధింపులు ఒకేలా తీవ్రమైనవని కోర్టు స్పష్టం చేసింది. ఇరువర్గాల మధ్య పెళ్లి చేసుకోవాలనే స్పష్టమైన ఉద్దేశం ఉండి, వివాహ బంధంతో సమానమైన వాతావరణంలో కలిసి ఉంటే ఈ చట్టం పూర్తిస్థాయిలో వర్తిస్తుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. Supreme Court Section 498Alive-in relationships domestic violenceJustice Sanjay KarolIPC 498A live-in partnerKarnataka High Court rulingArticle 14 gender equality.

https://telugu.newsmeter.in/nation/supreme-court-rules-section-498a-ipc-applies-to-live-in-relationships-in-the-nature-of-marriage-772914

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు