- Advertisement -
వృద్దులకు వస్త్ర దానం అన్నదానం
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని నేసే పేటకు చెందిన చేనేత రంగానికి చెందిన సాకే నాగరాజు కు ఆయన మిత్రులు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం గొట్లూరు అనాధ ఆశ్రమం లో వృద్దులకు వస్త్ర దానం, అన్నదానం చేసారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో శారద, స్వర్ణ దీపిక, స్వర్ణ జ్యోతి, మణి కంఠ, ప్రియాంక, శ్రీ కాంత్, జీవన్ నరసింహ న్ అశోక్ చౌడేయ్య, చంద్ర, అశ్వర్ధప్ప తదితరులు పాల్గొన్నారు.


