Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరెండు గంటల్లోనే వాహన దొంగ అరెస్ట్

రెండు గంటల్లోనే వాహన దొంగ అరెస్ట్

- Advertisement -

దొంగిలించిన టీవీఎస్ ఎక్సెల్ స్వాధీనం.. వన్ టౌన్ సీఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం; ఆగస్టు 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పార్క్ చేసి ఉంచిన టీవీఎస్ ఎక్సెల్ మోటారు వాహనం ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుని వెళ్లినట్లు బాధితుడు వెంకట చలపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సి ఐ రెడ్డప్ప తెలిపారు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదు అందుకున్న వెంటనే వన్ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, ఆర్టీజీఎస్-365 సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని గుర్తించి, సుమారు రెండు గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.
ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ, ప్రజలు తమ వాహనాలను ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయాలని, వాహనాలకు లాక్‌లు తప్పనిసరిగా వేయాలని సూచించారు. అలాగే, అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు