Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచితంగా కరాటే శిక్షణ తీసుకొని విజేతలుగా నిలిచారు..

ఉచితంగా కరాటే శిక్షణ తీసుకొని విజేతలుగా నిలిచారు..

- Advertisement -

హెడ్మాస్టర్ హేమంత్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా కరాటే శిక్షణ తీసుకొని నేడు విజేతలుగా రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని హెడ్మాస్టర్ హేమంత్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా క్యోకుషిన్ కరాటే జూనియర్స్ కోమితే మరియు కఠా టోర్నమెంట్ 2026 లో ధర్మవరం మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ లో గల మున్సిపల్ సెంట్రల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ఉచిత కరాటే శిక్షణ తీసుకొని విజేతలు కావడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల నుండి బి.మోక్షిత అండర్-09 కఠాలో మొదటి స్థానంలో, జె.గీతిక అండర్-09 కఠాలో రెండవ స్థానం, బి. ప్రవీణ్ కుమార్ కోమితే లో బోల్డ్ ఫైటర్ గా నిలిచారు అని తెలిపారు. విజేతలుగా నిలిచి వచ్చినటువంటి పిల్లలను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అని తెలిపారు. కరాటే శిక్షణ ఇస్తున్నటువంటి సిరిపి వెంకటేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి కరాటే మాస్టర్ చిలిపి వెంకటేష్ మాట్లాడుతూ నేటి కాలంలో కరాటేకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు ఉందని, ముఖ్యంగా బాలికలకు ఈ కరాటే ప్రాణ రక్షణ, భద్రత కనిపిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు