Homeజిల్లాలుఅనంతపురండీఎస్సీ-2025పై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు నిరాధారం: టిడిపి నేత ప్యారం కేశవానంద

డీఎస్సీ-2025పై వైఎస్సార్‌సీపీ ఆరోపణలు నిరాధారం: టిడిపి నేత ప్యారం కేశవానంద

- Advertisement -

రిలే దీక్షల్లో అభ్యర్థులు కాదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలే:

విశాలాంధ్ర, ఉరవకొండ: డీఎస్సీ-2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఉరవకొండ పీఏసీఎస్‌ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు ప్యారం కేశవానంద పేర్కొన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలేనని ఆయన విమర్శించారు.శుక్రవారం ఉరవకొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన, గత రెండు రోజులుగా జరుగుతున్న రిలే దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థులు లేదా నిరుద్యోగులు కనిపించలేదని, కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే పాల్గొంటున్నారని ఆరోపించారు.డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని, మెరిట్‌, రోస్టర్‌, నిబంధనలను పూర్తిగా పాటించినట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలకు సంబంధించి ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారికంగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ నిరుద్యోగులను రెచ్చగొట్టి డీఎస్సీపై అనుమానాలు సృష్టిస్తూ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ప్యారం కేశవానంద ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని విమర్శించారు.ప్రస్తుతం వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రాజకీయ ప్రేరేపిత దీక్షలు, ఆరోపణలు మానుకుని వాస్తవాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ప్యారం కేశవానంద హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు