రాష్ట్రంలో త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, సున్నా స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. శనివారం నెల్లూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ నేతలు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ఉన్నత న్యాయస్థానాలు హెచ్చరించినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నందుకా లోకేశ్ రాజీనామా చేయాలని కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ధర్నాలకు దిగుతోందని నారాయణ ఆరోపించారు. ఆ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఃమావిగన్ః అంటూ చేస్తున్న రాద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ
- Advertisement -
RELATED ARTICLES


