Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆగస్టు 10న జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ..

ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ..

- Advertisement -

శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దిల్షాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆగస్ట్ 10వ తేదీన జైలు మరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దిల్షాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం సిఐటియు జైలు భరో కార్యక్రమాలు విజయవంతం కోసం ధర్మవరం సిఐటియు ఆఫీసు నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దిల్షాద్ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అమెరికా తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, పంటల ఉత్పత్తి ఖర్చులపై అదనంగా 50 శాతము కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అమలు పరచాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ చేసి, రోజుకు ఆరు వందల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని ,విద్యుత్ ఆర్టీసీ మున్సిపాలిటీలలో ప్రైవేటీకరణ విధాలను ఆపాలని, జిల్లా వ్యాప్తంగా చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలని ,రాస్తా లేని రైతుల భూములకు రస్త ఏర్పాటు చేయాలని ,జిల్లాలో ఉన్న తిడుకో ఇళ్లను పూర్తిచేసి పంపిణీ చేయాలని తెలిపారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కొత్తగా ఏర్పడిన కాలనీలలో స్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇటువంటి అనేక రకమైన డిమాండ్ల సాధనకై ఈనెల 10వ తారీఖున జరిగే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు జె వి రమణ ఎస్ హెచ్ భాష గుంపు హరి ఏ ఖాదర్బాషా, వి వెంకటస్వామి, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బత్తల కదిరప్ప, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ ,ముదిగుబ్బ బాబ్జాన్ , పకీరప్ప,తాడిమర్రి నారాయణ, అంగన్వాడీ నాయకురాలు .డి.చంద్రకళ , సరస్వతి ,గోవిందమ్మ, స్కూల్ ఆయాలు జయమ్మ ,చౌడమ్మ, రైతు నాయకులు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు