Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబహువర్షిక పశుగ్రాసాల సాగు పై శిక్షణ కార్యక్రమము

బహువర్షిక పశుగ్రాసాల సాగు పై శిక్షణ కార్యక్రమము

- Advertisement -

ఉప సంచాలకులు డాక్టర్ శివప్రసాద్ రాజు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చింతలపల్లి గ్రామం లో ఆత్మ వారి సహకారం తో పాడి రైతులకు, గొర్రెల పెంపకం దారులకు బహువర్షిక పశుగ్రాసాల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ధర్మవరం ఉప సంచాలకులు డాక్టర్ శివప్రసాద్ రాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో బహు వార్షిక, ఏక వార్షిక, పప్పు ధాన్య, లెగ్యూమ్ జాతి, మేలు రకాల పశు గ్రాసల సాగు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడమైనది తెలిపారు. ఇప్పుడు ఉన్నటు వంటి ఎల్-నీనో పరిస్థితుల దృష్ట్యా నీటి ఎద్దడి ని తట్టుకొని ఇచ్చే పశు గ్రాసాల పై అవగాహనా మేత వృధా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగినది అని తెలిపారు. వర్షభావ పరిస్థితుల కారణంగా పెళ్లెట్ సీడ్ ప్రాధాన్యతను వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఏడి, పద్మాలత, డా. రామేశ్వర్ రావు, చింతలపల్లి పశు వైద్యదికారి డా. శేఖర్, ఏ హెచ్ ఏ లు, గోపాలమిత్రాలు, రైతు సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు