Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో ఘనంగా " నేతన్న సేవలో" కార్యక్రమం..

ధర్మవరంలో ఘనంగా ” నేతన్న సేవలో” కార్యక్రమం..

- Advertisement -

మెగా జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ
విశాలాంధ్ర ధర్మవరం;;12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమం ధర్మవరంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వల చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి నేతన్నకు, ప్రతి నేతమ్మకు, చేనేత రంగంతో అనుబంధం ఉన్న ప్రతి కుటుంబానికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది కేవలం ఒక చేతివృత్తి కాదని, భారతీయతకు ప్రతిబింబం, స్వదేశీ స్ఫూర్తికి ప్రతీక, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి జీవం పోసే కళ అని పేర్కొన్నారు. ధర్మవరం పట్టు చీర అనేది కేవలం వస్త్రం కాదని, ప్రపంచాన్ని ఆకట్టుకునే కళాఖండమని మంత్రి అన్నారు. ధర్మవరం చేనేత రంగానికి మరింత ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరైందని తెలిపారు. త్వరలోనే ధర్మవరానికి వీవర్ సర్వీస్ సెంటర్, సిల్క్ యార్న్ డిపో కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీని ద్వారా నాణ్యమైన పట్టు నూలు స్థానికంగానే అందుబాటులోకి రావడంతో పాటు చేనేత ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని తెలిపారు. ధర్మవరం పట్టు చీరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం చేనేత కుటుంబాల సంక్షేమం కోసం పింఛన్లు, ఉచిత విద్యుత్, నేతన్న సేవలో, మెగా క్లస్టర్లు, మౌలిక వసతులు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మవరం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని, చేనేత కార్మికుల అభివృద్ధికి, ధర్మవరం పట్టు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నేతన్న సేవ కార్యక్రమం ఈనెల 28వ తేదీన ధర్మవరంలోని సీఎన్‌బీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించి ఈ ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో రాంభూపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, హ్యాండ్లూమ్ ఏడి రామకృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ అప్పాజీ, డెవలప్మెంట్ పీవీ సుబ్బానాయుడు, ఏడీవోలు సేనసేన నాయక్, ఆర్ రాజేశ్వరి, వై రాజేశ్వరి, పవన్ కుమార్, చేనేతలు, హిందూపురం శాసనసభ్యులు ప్రతినిధి వీరయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి సేవా సమితి – ఏకలవ్య ఫౌండేషన్ విద్యా కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన విద్య, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం కల్పిస్తే భవిష్యత్తులో వారు దేశానికి నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదుగుతారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ , వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ధర్మవరంలోని శ్రీ గణేష్ మున్సిపల్ స్కూల్‌లో సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం – విద్యా వాహిని కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ, ప్రశ్నలు అడుగుతూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రసంగించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో వేసుకునే పునాదే జీవితాంతం భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అందుకే చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత, గణితం, తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి సేవాసమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రశాంత్, బాలకృష్ణపాఠశాల ప్రిన్సిపల్ బిల్లే భాస్కరయ్య, హెడ్మాస్టర్ సాఫుద్దిన్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు