Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలు

- Advertisement -

సిపిఐ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; దేశ సమైక్యత సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రచార పాదయాత్రలను నిర్వహిస్తున్నామని ధర్మవరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కేశవా నగర్ సిపిఐ కాలనీ నందు ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం చలో ఢిల్లీ గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, సిపిఐ నియోజకవర్గం ముసుగు మధు మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజలు, ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి కుల మతాల మధ్య వైశ్యమ్య రాజకీయాలు చేస్తూ స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలను శాసిస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బిజెపి విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార జాతాలు, పాదయాత్రలు, సెప్టెంబర్ 1 న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదానం వెలికితీత, దేశీయత, మేక్ ఇండియా, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి , సమగ్రాభివృద్ధి వంటి ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బిజెపి సర్కార్ ప్రజలో ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో వైశ్యమ్మ రాజకీయాలకు పాల్పడుతూ దేవుడి పేరుతో దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధికి వాడుకుంటూ సిబిఐ, ఈడి లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడు కొంటున్నారని మండిపడ్డారు. ఇటు ఎన్నికల కమిషన్ ను, ఆటో న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేస్తూ బిజెపి ఇతర రాష్ట్రాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ, నిరంకుశ పాలనకు నిస్సిగ్గుగా ప్రకటిస్తోందని వారు విమర్శించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికిన నరేంద్ర మోడీ ప్రతి ఏటా విత్తనాలు ఎరువులు, పురుగుమందులు పెట్టుబడుల భారాన్ని పెంచుతూ రాయితీలను కుదిస్తూ కనీస మద్దతు ధరపై కనికరం చూపకుండా, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించకుండా, అతివృష్టి అనావృష్టితో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణ విముక్తుల్ని చేయడానికి ససేమిరా అంటూ సాగు చట్టాల పేరుతో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు నిధులు నియామకాలు చేపట్టకుండా రాష్ట్రాలకు ఉన్న హక్కులు అవకాశాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఎక్కించాలన్న చూస్తున్నారన్నారు. వరుస పేపర్ లీకేజీలతో ప్రభుత్వ మీద నమ్మకం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మహిళలను గౌరవిస్తాం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు డీ లిమిటేషన్ , మహిళా బిల్లుకు ముడిపెట్టి చట్టసభల్లో 33 .3శాతం రిజర్వేషన్ బిల్లు వీగిపోయేటట్లు చేసిందన్నారు.
సంపద సృష్టిలో భాగస్వామ్యమైన శ్రమజీవులకు సంపద పంపిణీ చేయకుండా ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని పెంచు ఆకలి పేదరికం దారిద్రం నిరుద్యోగం నిరక్షరాస్యతను యధావిధిగా కొనసాగిస్తుందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టెందుకు , దేశ సమగ్రత సమైక్యత కోసం ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలు, సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా నిరంకుశ ప్రభుత్వ మెడలు వంచి దేశం కోసం జాతిని ఏకం చేసే కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుళ్లాయప్ప ,బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, సహాయ కార్యదర్శి ఓబులేసు ముదిగుబ్బ మండల కార్యదర్శి శ్రీనివాసులు, తాడిమర్రి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా ,మహిళా సమైక్య జిల్లా నాయకులు రమీజా లింగమ్మ ,సిపిఐ నాయకులు కేశవరెడ్డి, రామకృష్ణ, చౌడప్ప, దాసు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు