డి.ఎస్.పి… బివి జగన్నాథరాజు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అశ్విని , ఆమె భర్త శ్రీనివాసులు కుటుంబ విభేదాల కారణంగా గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథరాజు స్వయంగా నాగారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి, గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్న సమయంలో అశ్విని తన కుటుంబ సమస్యను డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అశ్విని, శ్రీనివాసులతో పాటు ఇరు కుటుంబ సభ్యులను ధర్మవరం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి, ఫ్యామిలీ కౌన్సెలింగ్ అధికారుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఇరువర్గాల సమస్యలను సానుకూలంగా విని, కుటుంబ బంధాల ప్రాధాన్యతను వివరించడంతో పాటు, పరస్పరం అర్థం చేసుకోవడం, సహనం, సఖ్యత ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా కుటుంబ జీవితాన్ని సంతోషంగా కొనసాగించవచ్చని వారికి సూచించారు. కౌన్సెలింగ్ అనంతరం శ్రీనివాసులు తన భార్య అశ్వినితో కలిసి సఖ్యతగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించగా, అశ్విని కూడా తన భర్తతో కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు తొలగి, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దంపతులను తిరిగి ఒక్కటిచేశారు. కుటుంబ సమస్యలను కౌన్సెలింగ్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించి, కుటుంబాలను నిలబెట్టేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని డీఎస్పీ తెలిపారు.
పోలీసుల చొరవతో ఒక్కటయ్యారు..
- Advertisement -
RELATED ARTICLES


