Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎంపీ లింగమనేని రమేశ్

కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎంపీ లింగమనేని రమేశ్

- Advertisement -

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈఓ, చైర్మన్, కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర – ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు (MP) లింగమనేని రమేశ్ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి (EO) వీ.కే. సీనా నాయక్ మరియు పాలకమండలి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎంపీ లింగమనేని రమేశ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు