Homeఅంతర్జాతీయంనేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ గోపిశెట్టి మిస్సింగ్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ గోపిశెట్టి మిస్సింగ్

- Advertisement -

రోజులు గడుస్తున్న కొద్దీ నేపాల్‌లో సంభవించిన జలప్రళయం తీవ్రత మరింత స్పష్టమవుతోంది. నిన్నటివరకు గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉండగా.. ఇప్పుడు దాదాపు రెండువేలకు చేరింది. ఈ క్రమంలో గల్లంతైన వారిలో టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ అనుబంధ సంస్థ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ లక్ష్మీనాథ్‌ గోపిశెట్టి (Lax Gopisetty) కూడా ఉన్నారు.ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. వ్యక్తిగత పనిమీద నేపాల్‌ వెళ్లిన గోపిశెట్టిని సంప్రదించలేకపోతున్నామని ఇన్ఫోసిస్‌ తెలిపింది.ఆయనను సంప్రదించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో గోపిశెట్టి కుటుంబానికి అండగా ఉంటామని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

అమెరికా, కెనడా ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలు
ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. అమెరికా, కెనడాలోని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.ఇన్ఫోసిస్‌ వెబ్‌సైట్‌లోని గోపిశెట్టి ప్రొఫైల్‌ ప్రకారం.. వ్యూహాలు, సాంకేతికత, కార్యకలాపాలు తదితర అంశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు ఆయన సలహాలు, సూచనలు అందిస్తుంటారు.ఇందుకు ముందు గోపిశెట్టి ఇన్ఫోసిస్‌లో గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బిజినెస్‌ అప్లికేషన్స్‌, డిజిటల్‌ వర్క్‌స్పేస్‌ సర్వీస్‌ విభాగాలకు ఆయన నాయకత్వం వహించారు.ఇన్ఫోసిస్‌లో చేరకముందు యాక్సెంచర్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు