Homeజిల్లాలుకర్నూలుఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ లో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ నరేష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తి వంటి సద్గుణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. ఖలీద్, ఉపాధ్యాయులు దీప్తి, ఈశ్వర్, నీలకంఠ, సతీష్ కుమార్, రామకృష్ణ, నరసింహులు, అశ్విని, పద్మావతి, ఆసియా, త్రివేణి, రుబిన, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు