Friday, January 31, 2025
Homeజిల్లాలుఅనంతపురంభారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న బిజెపి వైకరి మార్చుకోవాలి

విశాలాంధ్ర -అనంతపురం : భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విష్మరిస్తోందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమాత్రం పాత్రలేని ఆర్ ఎస్ ఎస్ విధానాలను బిజెపి అమలుచేస్తోందన్నారు,బ్రిటీష్ ప్రభుత్వంలోనే పోరాటాలతో అనేక కార్మిక చట్టాలు సాధించుకుంటే ఇప్పటి బిజెపి ప్రభుత్వం సవరణలు చేసి లేబర్ కోడ్సు తీసుకురావడం సరే అయితే కాదన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేవిధంగా మోడీ విధానాలు ఉన్నాయన్నారు. పేదలను మరింత పేదలుగా కార్పొరేట్ శక్తులు మరింత కోటీశ్వరులుగా మార్చడంలో బిజెపి ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. కనీస వేతనాలు లేవు అసంఘటిత కార్మికుల సంక్షేమం మరిచారన్నారు. దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలుచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజు,నగర అధ్యక్ష,కార్యదర్శులు దుర్గాప్రసాద్,కృష్ణానాయక్,మున్సిపల్ యూనియన్ నాయకులు వేణుగోపాల్,తిరుమలయ్య,ఎర్రప్ప,మెడికల్ యూనియన్ నాయకులు వెంకటేష్,రామాంజి,ప్రశాంత్,హమాలీ యూనియన్ నాయకులు అక్బర్,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు