- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో హరిజన బంగారప్ప భార్య లలితమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ రామన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు . మట్టి ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు వెంకన్న, నాయకులు భీమేష్, ఉరుకుందు, కాసిం, తాయన్న, మాజీ సర్పంచ్ శరణప్ప,మాజీ ఎంపీటీసీ ఈరన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శాంతప్ప, రంగన్న, బజారి, ఏసన్న, సంజీవప్ప, ఏసు, ఆనందు, దేవదానం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


