విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలోని శ్రీ గవి మఠం( దేవాలయం)సంస్థానానికి ఎస్‌సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఏజెంట్‌గా నియమించాలని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజు, తదితర నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై బుధవారం గవి మఠం అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. శ్రీ కరిబసవ రాజేంద్ర స్వాముల వారి కాలం నుంచి మాదిగలు మఠం అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారని తెలిపారు.. తరతరాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు.
మాదిగ సామాజిక వర్గానికి ఏజెంట్ పదవిలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. దేవాదాయ, ఆర్థిక శాఖ మంత్రులను కలిసి తమ డిమాండ్‌ను వివరిస్తామని చెప్పారు..తగిన నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బసవరాజు, బి.వన్నప్ప, వి.ఉపేంద్ర పాల్గొన్నారు.
గవి మఠం ఏజెంట్‌గా దళితులను నియమించాలని డిమాండ్
- Advertisement -


