- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ చిన్నముష్టూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ, పీఎంకేవీవై ఆధ్వర్యంలో వెబ్ డెవలపర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అష్రీఫ్ అలీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్తో పాటు వివిధ ఎంఎన్సీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8897810480 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


