Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం వినాయక చవితి ఉత్సవాలపై కమిటీ సభ్యులకు పోలీసుల అవగాహన సమావేశం..

ధర్మవరం వినాయక చవితి ఉత్సవాలపై కమిటీ సభ్యులకు పోలీసుల అవగాహన సమావేశం..

- Advertisement -

టూ టౌన్ సీఐ జయ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వన్ టౌన్, టూ టౌన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలపై ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసులు అవగాహన సమావేశాన్ని పట్టణంలోని ఎన్‌ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వినాయక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన ధర్మవరం టూటౌన్ సీఐ జయ నాయక్, వన్ టౌన్ ఎస్ఐ ఇషాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి అని,వినాయక ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి అని తెలిపారు. మూడు లేదా ఐదో రోజున వినాయక నిమజ్జనం పూర్తి చేయాలి..పోలీసుల సూచనలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలపై వినాయక కమిటీ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించామన్నారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వినాయక మండపాల వద్ద భద్రతా చర్యలు పాటించడంతో పాటు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసుల సూచనలు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.
వినాయక చవితి అనంతరం సాధ్యమైనంత త్వరగా, మూడు లేదా ఐదో రోజున నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు