Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్వచ్ఛంద సేవ కు ఉత్తమ అవార్డు, ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న న్యాయవాదులు

స్వచ్ఛంద సేవ కు ఉత్తమ అవార్డు, ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న న్యాయవాదులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో కోర్టులో న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తున్న సుమలత, బాల సుందరి లకు కర్ణాటక రాష్ట్రంలోని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ వారు అవార్డు, ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివరాజు గత 15 సంవత్సరాలుగా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమల రాజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సేవలు అందిస్తున్న వారి జాబితాను గుర్తించి, 50 మందికి పైగా స్వచ్ఛంద సేవ సంస్థల నిర్వాహకులను గుర్తించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలో లాయర్ సుమలత, లాయర్ బాలసుందరి వారు న్యాయవాద వృత్తిలో ప్రత్యేకంగా రాణిస్తూ, మరొకపక్క స్వచ్ఛంద సేవా సంస్థలలో తమ వంతుగా ప్రజలకు వివిధ రకాలుగా సేవలు అందిస్తూ మంచి గుర్తింపును పొందడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపకులైన శివరాజు ఈ ఇరువురి న్యాయవాదులను గుర్తించి ప్రత్యేక ఆహ్వానితులుగా బెంగళూరుకి వారిని పిలవడం జరిగింది. అనంతరం బెంగళూరు… యలహంకాలోని డాక్టర్ అంబేద్కర్ భవన్లో వీరిని ఘనంగా సత్కరించారు. తదుపరి సభలో వీరు చేసిన సేవలను అక్కడి వారికి తెలియజేశారు. నేడు స్వచ్ఛంద సేవా సంస్థలు అనేక రూపాలలో వివిధ రంగాలలో తమదైన శైలిలో సేవలు అందించడం భగవంతుడు ఇచ్చిన వరము అని వారు వర్ణించారు. ఈ సందర్భంగా లాయర్లు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు, ఈ ప్రశంసా పత్రం మా బాధ్యతలను మరింతగా పెంచిందని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మనిన్ని సేవలను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు