ఆర్ పి ఎఫ్ సి ఐ నాగేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; రైల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలు మంగళ సూత్రం దొంగతనం అయినట్లు ధర్మవరం ఆర్పిఎఫ్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో నివసిస్తున్న భారత నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న కుమ్మర గోవిందు, వారి భార్య సంధ్య కలిసి షిరిడి సాయిబాబా దర్శనం కోసం వెళ్లారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన కోపర్గావ్ రైల్వే స్టేషన్ చేరుకొని తెల్లవారుజామున రైలు నెంబర్ 12628 కర్ణాటక ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు. ప్రయాణ సమయంలో వారు వేరువేరుగా ప్రయాణించారు. తదుపరి భార్య ప్రయాణిస్తున్న లేడీస్ కోచ్కు భర్త వెళ్లారు. అక్కడే భార్యతో కలిసి భోజనం చేశారు. భోజనం పూర్తి అయ్యాక ఆ ఘటనకు సంబంధించి అనుమానితురాలిగా గుర్తించబడిన ఓ మహిళా ప్రయాణికురాలు చిక్కి వంటి ప్రసాదాన్ని భార్యాభర్తలకు ఇచ్చారు. తిన్న తర్వాత వారు నిద్రలోకి జారుకున్నారు. తదుపరి మెలకువ వచ్చిన భర్త ,భార్య అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి, లేపడం జరిగింది. తదుపరి ధర్మవరం రైల్వే స్టేషన్ దిగి జరిగిన విషయాన్ని ధర్మవరం ఆర్పీఎఫ్ సిఐ నాగేశ్వరరావుకు వివరించారు. సుమారు 50 గ్రాముల గురువు గల మంగళసూత్రం దొంగతనం అయిందని వారు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్పిఎఫ్, జిఆర్పి సిబ్బంది తరలించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత సెప్టెంబర్ 16వ తేదీ ఆర్ పి ఎస్ రైల్వే స్టేషన్లో హాజరై గొలుసు దొంగతనం కావడం జరిగిందని తెలుపుతూ ఫిర్యాదు చేశారు. తదుపరి ఆర్పిఎఫ్ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకొని సోలాపూర్ నుంచి దొంగతనం చేసే మహిళల ఫోటోలను తెప్పించి బాధితురాలికి తెలుపగా, బాధితురాలు ఫోటోను గుర్తించింది. దీంతో త్వరలోనే దొంగతనం చేసిన మహిళను పట్టుకుంటామని తెలిపారు. ఇటీవలే దొంగతనం చేసిన ఈ మహిళ పలు పాత కేసుల్లో నమోదయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ షణ్ముఖ రెడ్డి, కానిస్టేబుల్ ప్రగతి తదితరులు కలరు.
మత్తుమందుతో రైల్లో మంగళసూత్రం దొంగతనం…
- Advertisement -
RELATED ARTICLES


