- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా కే. సుందరేశ్వరరావు బాధ్యతలను స్వీకరించారు. వీరు కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిగా ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ గా బదిలీగా వచ్చారు. అనంతరం కళాశాల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది నూతన ప్రిన్సిపాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ సుందరేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల విద్య ప్రమాణాల పెంపుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి విద్యార్థుల సమగ్ర వికాశానికి తాను కృషి చేస్తానని తెలిపారు.


