డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు డిప్యూటీ డిఏం హె ఓ. డాక్టర్. భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నులి పురుగులు నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్
సునీల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 25న పట్టణంలోని పిల్లలు అందరికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు వారికీ 250 ఎంజి 1/2 మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాలు వారికీ 500 ఎం జి 1 మాత్ర ఇవ్వాలని తెలిపారు.అన్నీ అంగన్వాడీ, పాఠశాలలు, కళాశాల వారికీ మాత్రలు ఇవ్వాలన్నారు. డి ఎం ఓ డాక్టర్ చెన్నా రెడ్డి మాట్లాడుతూ హ్యాండ్ వాష్ గురించి వివరించారు. నులి పురుగులు వల్ల రక్తహీనత,కడుపునొప్పి, జ్ఞాపకాశక్తి, దురదలు మొదలగు వల్ల ఆరోగ్యం క్షినుస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణo లోని అన్నీ యూపీహెచ్సి వైద్యాధికారులు, ఏఎన్ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, సూపర్ వైసర్ అన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
నులి పురుగులు నివారణ పై అవగాహనా కార్యక్రమం..
- Advertisement -
RELATED ARTICLES


