విశాలాంధ్ర-డుంబ్రిగుడ:టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను అరకు, కిల్లోగుడఉసోవ్వా క్లస్టర్‌కు చెందిన ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న కిల్లోగుడ పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు, కంగువలస మోడల్ స్కూల్ హెచ్ఎం నరసింహారావు, గత్తర జిలేడు పాఠశాల హెచ్ఎం మహాలక్ష్మిలను ఉపాధ్యాయులు దుశ్శాలువ కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, అవార్డులు అందుకున్న ఉపాధ్యాయుల కృషి, సేవలకు దక్కిన గౌరవంగా ఈ సన్మానాన్ని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలతో పాటు క్లస్టర్ హెచ్ఎంలు, సెక్రటరీలు, హుసేన్ , చినబాబు, దేవదాస్, రామారావు,శేఖర్ గేన్నుబాబు, రామన్న,రాము శంకర్ రాజ్‌కుమార్ మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..
- Advertisement -
RELATED ARTICLES


