‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో 372 మందికి పట్టాల పంపిణీ
కుంచనపల్లిలో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఃమన ఇల్లు-మన లోకేశ్ః కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 80 శాతం పట్టాల సమస్యను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదల దశాబ్దాల కలను నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు రెండు విడతలుగా పట్టాల పంపిణీ పూర్తి చేశారు. తొలి విడతలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశారు. ఈ రెండు విడతల్లో కలిపి సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములకు ఉచితంగా శాశ్వత హక్కులు కల్పించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు.
372 కుటుంబాలకు నెరవేరిన సొంతింటి కల
- Advertisement -
RELATED ARTICLES


