Homeఅంతర్జాతీయందక్షిణాఫ్రికాలో సామూహిక కాల్పులు.. 28 మంది మృతి

దక్షిణాఫ్రికాలో సామూహిక కాల్పులు.. 28 మంది మృతి

- Advertisement -

జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ సమీప ప్రాంతాల్లో కొద్ది గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి.
ఈ రెండు ఘటనల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 26 మంది గాయపడ్డారు. అయితే ఈ కాల్పులకు దారితీసిన కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.శనివారం రాత్రి జోహన్నెస్‌బర్గ్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని వెడెలా టౌన్‌షిప్‌లో తొలి ఘటన చోటుచేసుకుంది.
ఓ బార్‌ వద్ద బయట కూర్చున్న వారితో పాటు లోపల ఉన్న వారిపైనా ఎనిమిది మంది దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు సమాచారం.

నాలుగు గంటలకే మరో ఘటన
తొలి ఘటన జరిగిన సుమారు నాలుగు గంటల తర్వాత కేప్‌టౌన్‌ శివారులోని లాండ్వేల్‌ టౌన్‌షిప్‌లో మరో సామూహిక కాల్పుల ఘటన జరిగింది.ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట దాటిన తర్వాత ఓ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలోనే రెండు ప్రాంతాల్లో సామూహిక కాల్పులు జరగడంతో దక్షిణాఫ్రికాలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఈ రెండు ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? కాల్పుల వెనుక ఉద్దేశం ఏమిటన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు