Homeజాతీయంకుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

- Advertisement -

సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్.. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి భారీ నష్టాలను నమోదు చేశాయి. అమ్మకాల ఒత్తిడితో సూచీలు గణనీయంగా పతనమయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,124.02 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టపోయి 72,771.72 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 360.25 పాయింట్లు లేదా 1.56 శాతం క్షీణించి 22,780.25 వద్ద ముగిసింది. ఇక సోమవారం మార్కెట్‌ ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేయగా.. మరికొన్ని స్టాక్స్‌ నష్టాలను చవిచూశాయి.

నష్టాల్లో మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌, మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌, క్రిసిల్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలు టాప్‌ గెయినర్స్‌ జాబితాలో నిలిచాయి. అదే సమయంలో మణప్పురం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ వంటి కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు