- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో మంగళవారం జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో రెండో సారి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా రెడ్డి ఇర్ఫాన్ పటేల్, వైస్ చైర్మన్ గా సిపిఐ నాయకులు షేక్ ఇస్మాయిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను రెండో సారి కూడా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా ఎన్నుకుందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


