Homeఅంతర్జాతీయంమైన్మార్‌లో సైన్యం వైమానిక దాడి

మైన్మార్‌లో సైన్యం వైమానిక దాడి

- Advertisement -

49 మంది మృతి` మరో 22 మంది పరిస్థితి విషమం

నే పీ డా: మైన్మాలో సైన్యం మరోసారి వైమానిక దాడులు చేసింది. రఖెన్ రాష్ట్రంలోని ఓ మార్కెట్ సమీపంలో బాంబులు జార విడిచింది. ఈ దాడిలో 49 మంది మరణించగా, మరో 58 మంది గాయపడ్డారు. 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో వ్యాపారులు, కొనుగోలుదారులు, అటుగా వెళుతున్న వారు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రఖెన్లోని క్యౌక్తావ్ ప్రాంతం అరాకాన్ ఆర్మీ ఆధీనంలో ఉంది. ఓ సైనిక విమానం మార్కెట్ సమీపంలో రెండు బాంబులు వేసిందని అరాకాన్ ఆర్మీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రఖెన్కు చెందిన సీనియర్ రెస్క్యూ అధికారి హున్ ఆంగ్ స్పందిస్తూ మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ధ్రువీకరించారు. దాడి జరిగిన సమయంలో మార్కెట్ రద్దీగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడితో అక్కడి భవనాల్లో మంటలు చెలరేగాయి. వాహనాలు దెబ్బతిన్నాయి. సమీప వంతెన దెబ్బతిన్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అరాకాన్ ఆర్మీ హెచ్చరించింది. ప్రాణనష్టాన్ని ఉపేక్షించేది లేదని పేర్కొంది. కాగా, గత డిసెంబరులో రఖెన్లోని మ్రౌక్-యమూ టౌన్‌షిప్‌లో మైన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 34 మంది మరణించగా, 80 మంది గాయపడిన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరి నుంచి మైన్మార్ సైనిక పాలనలో ఉండటం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు