Homeఅంతర్జాతీయంహీరోగా భారత పైలట్.. విమానాన్ని కూల్చే కుట్ర భగ్నం.. నిజమో కాదో తెలియదన్న ట్రంప్!

హీరోగా భారత పైలట్.. విమానాన్ని కూల్చే కుట్ర భగ్నం.. నిజమో కాదో తెలియదన్న ట్రంప్!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విమానంలో జరిగినట్లుగా చెబుతున్న అసాధారణ ఘటన గురించి సంచలన వివరాలు వెల్లడించారు. యూఏఈ నుంచి ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను ఎలా భగ్నం చేశారో ఆయన వివరించారు. అయితే, ఈ కథ అంతా తనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారని, దీనిలో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని చెప్పడం గమనార్హం.ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు పంచుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. ఆ విమానం కో-పైలట్ ఒక ఉగ్రవాది లేదా మానసిక స్థితి సరిలేని వ్యక్తి అయి ఉండొచ్చు. అతను విమానం నడుపుతున్న పైలట్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ పైలట్ భారతీయుడైన స్మిత్ మచ్చర్. తీవ్రంగా గాయపడినా అతను ధైర్యంగా పోరాడాడు. కాక్‌పిట్ డోర్ తెరిచి, సహాయం కోసం గట్టిగా అరిచాడు. అతను నిజమైన హీరో అని ట్రంప్ ప్రశంసించారు.ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ఇజ్రాయెల్ ప్రయాణికుడు అద్భుతమైన రీతిలో జోక్యం చేసుకున్నాడు. వృత్తిరీత్యా ప్లంబర్ అయిన అతనికి విమానాలు నడపడంలో ఎలాంటి అనుభవం లేదు. కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి, కో-పైలట్‌ను సీటులోంచి బయటకు లాగి వెనక్కి తోసేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులు అతడిని బంధించారు.విమాన ప్రమాదాలపై వచ్చే ఃఎయిర్ డిజాస్టర్స్ః అనే టీవీ షోను తాను తరచుగా చూస్తానని, దాని ద్వారానే విమానం నడపడంలో కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకున్నానని ఆ ప్లంబర్ తర్వాత చెప్పినట్లు నెతన్యాహు నాతో అన్నారు అని ట్రంప్ వివరించారు.ఆ తర్వాత విమానం వెనుక భాగంలో ఉన్న అదనపు పైలట్లు, భద్రతా సిబ్బంది కాక్‌పిట్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని, అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇది నేను విన్న అత్యంత అద్భుతమైన కథ అని ఆయన వ్యాఖ్యానించారు.అయితే, ఈ కథనంపై చివర్లో ట్రంప్ స్వయంగా ఓ స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం నేను విన్న కథ మాత్రమే. ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఈ సమాచారం నాకు నెతన్యాహు, మరికొన్ని ప్రాథమిక వర్గాల నుంచి అందింది. నేను కేవలం నాకు అందిన సమాచారాన్నే మీకు చెబుతున్నాను అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు