Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ మీటర్ రీడర్స్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి...

విద్యుత్ మీటర్ రీడర్స్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి…

- Advertisement -

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యుత్ మీటర్ రీడర్స్ కు కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ మీటర్రీడర్స్ ఆంద్రప్రదేశ్ విద్యుత్ సంస్థ ను నమ్ముకొని గత 15 నుండి 20 సంవత్సరాలకు పైబడి విద్యుత్ సంస్థను నమ్ముకుని, జిల్లాలో అత్యంత నిబద్ధతతో విద్యుత్ మీటర్ రీడర్స్ గా విధులు నిర్వహిస్తున్నారని, అయితే, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని తెలిపారు.. ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి పూల శెట్టి రవి మరియు ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ మీటర్స్ అధ్యక్షులు రెడ్డి వారికి కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షులు దస్తగిరి జగదీష్ రమేష్ బాబు శివానంద తదితర మీటర్ రీడర్స్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ నెలలో కలిపి రెండు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి అని, యాజమాన్య ఒప్పందం (అగ్రిమెంట్) ప్రకారం టౌన్ పరిధిలో ప్రతి సర్వీసుకు అర్బన్ పరిధిలో రూ.3.63 చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్ మాకు కేవలం రూ.3.40 మాత్రమే ఇస్తున్నారు అని తెలిపారు. అదేవిధంగా, రూరల్ (గ్రామీణ) పరిధిలో ప్రతి సర్వీస్కు రూ. 3.73 చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్ కేవలం రూ.3.55 మాత్రమే చెల్లిస్తూ మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారం ప్రతి నెల 5వ తారీఖు లోపు మీటర్ రీడర్లకు జీతాలు చెల్లించాల్సి ఉంది. కానీ గత రెండు నెలలుగా మాకు జీతాలు ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిలదీసిన లేదా జీతాలు అడిగిన మీటర్ రీడర్లను విధుల నుండి తొలగిస్తామని కాంట్రాక్టర్లు బెదిరింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. కచ్చితంగా ఇస్తామని చెప్పడంతో వినియోగదారులకు అంతరాయం కలగకుండా ఉండాలని సెప్టెంబర్ నెలకి సంబంధించి బిల్లింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అని, అయినా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు అని తెలిపారు.నవంబర్ 2024 నెలకు సంబంధించిన ఈ.పి.ఎఫ్. నిధులను నామమాత్రంగానే చెల్లించారు అని తెలిపారు. దీని గురించి అధికారులను కాంట్రాక్టర్లను ప్రశ్నించగా, ఒకరిపై ఒకరు నెపం నెడుతున్నారు అని తెలిపారు. ప్రస్తుతం ఈ.పి.ఎఫ్.కు సంబంధించిన బ్యాలెన్స్ సొమ్ము డిపార్ట్మెంట్ వద్దే నిలిచిపోయి ఉంది అని తెలిపారు.మా కష్టాన్ని కుటుంబాల పరిస్థితిని గుర్తించి, మాకు రావలసిన పూర్తి వేతన బకాయిలను వెంటనే ఇప్పించాలని, ఒప్పందం ప్రకారం జీతాలు అందేలా చూడాలని వారి డిమాండ్ చేశారు.
గత రెండు నెలల జీతాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 30 తారీకు లోపు చెల్లించకుంటే అక్టోబర్ ఒకటో తారీకు నుంచి ఎస్సీ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమం చెస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు