Homeజిల్లాలుతూర్పు గోదావరిపేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం సంకల్పం

పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం సంకల్పం

- Advertisement -

రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్…

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి. సుబ్బారావు అన్నారు. మండలంలోని పోతంగి పంచాయతీ కేంద్రంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధికి, సంక్షేమానికి ఎక్కడ రాజు పడకుండా ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి తీపి కబురు వస్తుందని ఆయన ఆస భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోతంగి పంచాయతీ సెక్రటరీ గౌతమి, మాజీ ఎంపీపీ దన్నేరావు, సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ భాస్కరరావు, తెలుగుదేశం పార్టీ పోతంగి పంచాయతీ అధ్యక్షుడు భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు