Homeజిల్లాలుఅనంతపురంఓటు చోరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆందోళనలు..

ఓటు చోరీకి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆందోళనలు..

- Advertisement -

ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి..అఖిల పక్షం నాయకులు

విశాలాంధ్ర – అనంతపురం కార్పొరేషన్: ఓటు చోరీకి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. గురువారం సీపీఐ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దేశ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటు చోరీకి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలన్నీ బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల ఓటు హక్కును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు దాదాగాంధీ, వాసు, శర్మాస్‌వలి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు రాయుడు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకుడు పరుశురాం, సీపీఐ జిల్లా కమిటీ నాయకులు కేశవరెడ్డి, లింగమయ్య, నాగరాజు, వి.కె.కృష్ణుడు, సీపీఎం నాయకులు కృష్ణమూర్తి, గోపాల్, కాంగ్రెస్ నాయకులు జాకీర్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు