Homeజిల్లాలుఅనంతపురంసీజనల్ వ్యాధులను అరికడదాం

సీజనల్ వ్యాధులను అరికడదాం

- Advertisement -

మలేరియా అధికారి డాక్టర్ మనోజ్

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మనోజ్ పేర్కొన్నారు. శనివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన మలేరియా సబ్ యూనిట్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ప్రతి ఆరోగ్య సిబ్బంది, పర్యవేక్షకులు ఇంటింటా తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించాలని దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు ,మెదడువాపు వ్యాధులపై అవగాహన కల్పించాలని, జ్వరాలు గుర్తిస్తే రక్త పరీక్షలు, ఆసుపత్రికి పంపడం చేయాలని, జిల్లా కార్యాలయానికి సమాచారం అందించాలని చెప్పారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులతో గ్రామాల్లో ఏ ఒక్కరు మరణించకూడదని, మరణాలు జరిగితే సంబంధిత సిబ్బంది బాధ్యులు గా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జిల్లా మలేరియా అధికారి టి వెంకటేశ్వర్లు మలేరియా సబ్ యూనిట్ అధికారులు బత్తుల కోదండరామిరెడ్డి గిరిధర్ రెడ్డి చిగురుపాటి శ్రీనివాసులు ఎస్ ప్రభాకర్ తిరుపాలయ్య నాగేంద్రప్రసాద్ మున్ ఆఫ్ హెల్త్ సూపర్వైజర్లు రమేష్ లోకేశ్వర్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి నూరు బాషా శ్రీధర్ మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు