Homeజిల్లాలుఅనంతపురంపెన్నా నది తీరంలో వరుణ యాగం

పెన్నా నది తీరంలో వరుణ యాగం

- Advertisement -

పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు వరుణ యాగం, వరుణ జపం చేపట్టారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పెన్నా నది వద్దకు చేరుకుని వరుణ యాగం, వరుణ జపం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సాకే రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ రేగటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు ఎ.ఎన్‌. ద్వారకనాథాచార్యులు, అర్చకులు ఎం. బాలాజీ, గుండురావు వేదమంత్రోచ్ఛారణల మధ్య వరుణ దేవునికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, చంద్ర మౌళి స్వామి, దేవేంద్ర, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు