Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీకి ప్రశంసల జల్లులు

ధర్మవరం రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీకి ప్రశంసల జల్లులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం::హైదరాబాద్ రవీంద్ర భారతి లో అల్ ఇండియా డాన్స్ పోటిల్లో దసరా, గాంధీ జయంతి ఫెస్టివల్ 2026 లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం కి చెందిన రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ విద్యార్థులకు ప్రశంసల జల్లులు వెరిసాయి.హైదరాబాద్ లో భారత్ ఆర్ట్స్ అకాడమీ మరియు గ్లోబల్ ఈవెంట్స్ అవహ్నం కొరుకు రవీంద్ర భారతి నందు జరిగిన అల్ ఇండియా డాన్స్ పోటిల్లో మాస్టర్స్ అస్లాం, లోకేష్, వంశీ పర్యవేక్షణ లో వారి విద్యార్థులు భవిష్, అమాన్,యష్ అశ్విని,తెజేష్ , గౌతమ్, యాక్షిత, లాస్య, గురు గగన్, లక్కీ,నాని, వరుణ్, యోజిత్, కార్తికేయ,నిక్షల, మోక్ష శ్రీ ప్రదర్శించిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిలు గా సరస్వతి పుత్రులు, దైవజ్ఞ శర్మ , రాందాస్ తేజవoత్ (ఏ డి డి ఐ డి సి పి ట్రాఫిక్ హైదరాబాద్)కోలేటి దామోదర్ (ఫార్మర్ చైర్మన్ ,పోలీస్ హోసింగ్ కోర్పరేషన్.. టి. ఎస్, బ్రహ్మ డాక్టర్. నాగుల సత్యం గౌడ్ (అధ్యాత్మిక గురు,ఫిలోసఫర్ ) ఇంకా ఎందరో ప్రముఖులు పాల్గున్నారు.. అనంతరం వీరి చేత డాన్స్ మాస్టర్ అస్లాం కు ఘనంగా శాల్వతో సత్కరించారు ఇందులో పాల్గున్న విద్యార్థులకు ఫ్యూచర్ స్టార్ట్ బుక్ అఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ తో పాటు అవార్డులు లభించాయి అలాగే డాన్స్ మాస్టర్ అస్లాం, లోకేష్, వంశీ మాట్లాడుతూ మన రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ నుంచి మా విద్యార్థులు ఇంతకీ ముందు వరకు వండర్ బుక్ అఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్,కళాకార్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇప్పుడు ఫ్యూచర్ స్టార్ బుక్ అఫ్ రికార్డు లో మా విద్యార్థులు పేర్లు నమోదు చేసినందుకు భారత్ ఆర్ట్స్ అకాడమీ సమస్త కి కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే డాన్స్ మాస్టర్ అస్లాం మాట్లాడుతూ మన రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ గత 14 సంవత్సరాల నుండి ఎందరో పిల్లలకు వెస్ట్రన్ డాన్స్ లో శిక్షణ ఇచ్చి అనేక టీవీ షో లో పరిచయం చేసి,అలాగే ఇలాంటి ప్రసద్ది గాంచిన వేదికలో చాలా ప్రదర్శన లు ఇచ్చిన మన ధర్మవరo రాకింగ్ స్టార్స్ డాన్స్ అకాడమీ తరుపున ఎందరో విద్యార్థులు ఉన్నారని తెలియచేసారు.. అలాగే పేద విద్యార్థులు ఎవరయినా నాట్యం నేర్చుకువాలి లో నాట్యం లో ముందు రాణించాలి అనుకున్నవారు ఎవరయినా ఉంటే మమ్మల్ని సంప్రదించిలాని, మా వంతుగా ఉచితంగా డాన్స్ శిక్షణ ఇచ్చి ముందు ముందు జరగబోయే కార్యక్రమంలో టీవీ షోస్ లో ప్రదర్శనలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు