విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో 8వ తరగతి 9వ తరగతి మరియు 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన సబ్ డివిజన్ స్థాయి క్విజ్ కార్యక్రమాన్ని ఈరోజు ధర్మవరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది అని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ హెచ్ఐవి/ఎయిడ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని, కేవలం అవగాహన ద్వారానే హెచ్ఐవి ని నియంత్రించవచ్చని తెలిపారు. ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ వెంకట రత్నం మాట్లాడుతూ విద్యార్థులు, యువతలో హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్విజ్ లో మొత్తం పది టీములు పాల్గొన్నాయి. అందులో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు హర్ష, వెంకట చరణ్ మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో జయసూర్య, సాయి సుందర్, మూడవ స్థానంలో యశ్వంత్ రాజ్, సాయి దుర్గేశ్ నిలిచారు. వీరు వచ్చే వారం జరిగే జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఓ ఈవి రమణ, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
హెచ్ఐవి పై అవగాహన కొరకు క్విజ్ పోటీల నిర్వహణ.. ప్రిన్సిపాల్ ప్రశాంతి
- Advertisement -
RELATED ARTICLES


