విశాలాంధ్ర- రాజాం (.విజయనగరం జిల్లా): రాజాం మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నీటి పన్ను, ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయుడు శనివారం ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. రాజాంలో అభివృద్ధి జరగాలంటే ప్రజలు సకాలంలో చెల్లించవలసిన పన్నులు చెల్లించి రాజాం పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొండి బకాయిదారులు నీటి కొళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు.