Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆత్మీయ ట్రస్ట్, యూటీఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 16 ఉచిత గుండె శిబిరం

ఆత్మీయ ట్రస్ట్, యూటీఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 16 ఉచిత గుండె శిబిరం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం ;ఆత్మీయ ట్రస్ట్ ,ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరానికి చెందిన మార్క్ హాస్పిటల్ సౌజన్యంతో ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడునని ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి ధర్మవరం డివిజన్ యూటీఎఫ్ నాయకుల ఆంజనేయులు, హరికృష్ణ, రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఈ మెడికల్ క్యాంపు నందు నందు ఉచితంగా షుగర్ ,బిపి, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును అని ఈ పరీక్షలు మార్క్ హాస్పిటల్ వారి సౌజన్యంతో చేయబడునని తెలియజేశారు.. క్యాంపుకు హాజరయ్యేవారు ముందస్తుగా 9030944717 ,94417 34907 చరవాణి లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు