Homeతెలంగాణఓటు హ‌క్కు కోల్పోయిన వారు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం

ఓటు హ‌క్కు కోల్పోయిన వారు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం

- Advertisement -

ఈ నెల 21 వరకు అవకాశం క‌ల్పించిన ఈసి : నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి ల‌క్ష్మికాంత్ రెడ్డి
విశాలాంధ్ర‌, మ‌ల్కాజిగిరి : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఫలించిందని మల్కాజిగిరి నియోజకవర్గం ఇంచార్జి లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ఓటు ఆనంద్‌బాగ్‌లోని మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మ‌ట్లాడుతూ… ఓటు హక్కు కోల్పోయిన అర్హులైన ప్రజలకు మరో అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఫలించిందని, కాంగ్రెస్ పార్టీ పోరాటం, విజ్ఞప్తుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించి అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఈ నెల 21వ వరకు అవకాశం కల్పించిందని వెల్లడించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల మ‌ద్ద‌తుతో పెద్ద ఎత్తున గ‌ల్లీ నుండి ఢిల్లీ వ‌ర‌కు పోరాటం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, పిసిసి అధ్య‌క్షులు మ‌హేష్ గౌడ్‌, ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు , మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహితులు ఉద్య‌మించార‌ని, దీని భాగంగా ఇటీవ‌ల‌ దాదాపు 100 కార్లలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ వరకు వెళ్లి ఎన్నికల కమిషన్ దృష్టికి ఓటర్ల సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్ళిన వాళ్ళు, వ‌ల‌స వ‌చ్చిన వారు త‌మ ఓటు హ‌క్క‌ను కోల్పోయిన వారు, తిరిగి ఓటు హ‌క్కును పొందేందుకు గ‌తంలో త‌మ ఓట‌రు గుర్తింపు కార్డు నెంబ‌ర్‌ను వేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు నమోదై ఉన్నాయనే కారణంతో ఓటు హక్కు కోల్పోయిన వారు కూడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు నిర్ణీత దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని లక్ష్మీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తమ హక్కును కోల్పోకూడదన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్, నాయ‌కులు వెంకటేశ్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, జి.ఎన్‌.వి.సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్, అశోక రెడ్డి, ఎస్.ఆర్.ప్రసాద్, రాందాస్ సంతోష్ ముదిరాజ్, జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్, సత్యమూర్తి, పిట్టల నాగరాజు, రాఘవన్, శ్రీకాంత్ ముదిరాజ్, లక్ష్మీ, ఆశా, కుట్టి శ్రీనివాస్ యాదవ్, బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కపిల్, పార్ధు, బాలరాజు యాదవ్, బ్రహ్మయ్య, పరమేశ్, రాము, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు