విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ చిత్తూరు జిల్లా వైయస్సార్ పార్టీ పరిశీలకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి గురువారం తాడేపల్లి లో ఉన్న వైయస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వైయస్సార్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ ను వైయస్సార్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసినా అరాచకాలను ఎదుర్కొంటూ సమిష్టిగా పనిచేసి మున్సిపల్ కార్పొరేటర్ లను రమేష్ గౌడ్ ను గెలిపించినందుకు చిత్తూరు జిల్లా వైయస్సార్ పార్టీ పరిశీలకులు చవ్వా రాజశేఖర్ రెడ్డిని మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు.


