అందరి మన్ననలు పొందుతున్న కొమరగిరి ట్రస్ట్
భరద్వాజ్ ఆధ్వర్యంలో ఎంతోమందికి కంటి వెలుగు
విశాలాంధ్ర-వత్సవాయి : సర్వేంద్రియానం నయనం ప్రధానమం అంటారు పెద్దలు…. అన్ని అవయవాలలో నేత్రాలు ప్రధానమని అర్థం వెలుగు లేకపోతే జీవితమే శూన్యం…… ఇది వాస్తవమని ప్రతి ఒక్కరికి తెలిసినదే….. ప్రస్తుత సమాజంలో రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితులు….. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న పేద మధ్యతరగతి బీద సాధక బాధలను చూసిన మక్కపేట గ్రామానికి చెందిన కొమరగిరి సవితా భరద్వాజ్ వారి సారథ్యంలో కొమరగిరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమందికి జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే చాలా గ్రామాలలో చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ కంటి ఆసుపత్రి వారి సహాయ సహకారాలతో ఎంతోమందికి వెలుగు నింపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు….
మంగళవారం నాడు మక్కపేట శ్రీ సాయి సెంచరీ హై స్కూల్ లో నిర్వహించిన కంటి వైద్య శిబిరం లో పెద్ద ఎత్తున కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
109 మంది కి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించుకోవటం జరిగింది .. వారిలో 8 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేశారు వారిని పిన్నమనేని సిద్ధార్థ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక బస్ లో ఆసుపత్రికి పంపించారు….
ఈ కార్యక్రమం లో కొమరగిరి ట్రస్ట్ చైర్మన్ కొమరగిరి భరద్వాజ్ శ్రీ సాయి సెంచరీ స్కూల్ ప్రిన్సిపాల్ కొమరగిరి సవిత పి ఆర్ ఓ రాఘవ డాక్టర్ షారుణ్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..