ఉత్తర్‌ప్రదేశ్‌లో బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డంపర్ ట్రక్ వంతెన రైల్వే రైలు మార్గాన్ని ఢీ కొట్టి, రైలు ట్రాక్‌లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో అమృత్‌సర్-బిహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ తృటిలో వెళ్తున్నది. రైలుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.సమాచారం అందగానే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనంలో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను రేస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీశారు, తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
ట్రాక్‌పై డంపర్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియా మాట్లాడుతూ, ఁడంపర్ లోపల డ్రైవర్ చిక్కుకుపోయాడు. పోలీసులు, రైల్వే అధికారులు, ఇతర విభాగాల సహాయంతో అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించాముఁ అని తెలిపారు. ట్రాక్‌పై డంపర్ పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదం తర్వాత ఒక ప్రాసింజర్ రైలు కూడా ఆ మార్గంలో నిలిచిపోయింది, దాన్ని తరలించడానికి ప్రత్యామ్నాయ ఇంజిన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైలు సురక్షితంగా ఉందని.. ట్రక్కు సమీపంలోని లైన్‌పై పడిపోయిందన్నారు. ట్రాక్‌ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత రైల్ల రాకపోకలు పునరుద్ధరించబడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.


