Homeజాతీయంఆంధ్రప్రదేశ్ కు దక్కిన అరుదైన అవకాశం

ఆంధ్రప్రదేశ్ కు దక్కిన అరుదైన అవకాశం

- Advertisement -

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ( iju) లో ఆంధ్రప్రదేశ్ కు అరుదైన అవకాశం దక్కింది… iju సెక్రటరీ జనరల్ గా రాష్ట్రానికి చెందిన apuwj పూర్వపు అధ్యక్షులు డి. సోమసుందర్ ఎంపిక కాబోతున్నారు… ఆ మేరకు సోమవారం సాయంత్రం సోమసుందర్ గారు నామినేషన్ దాఖలు చేశారు.. పాట్నా లో ఎన్నికల ప్రధాన అధికారి మహేష్ సిన్హా కు సోమసుందర్ తన నామినేషన్ అందజేశారు… సోమసుందర్ నామినేషన్ ను apuwj, tuwj తో పాటు 17 రాష్ట్రాలు బలపర్చాయి…. iju అధ్యక్ష పదవికి ప్రస్తుత సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ నామినేషన్ దాఖలుచేశారు… రెండు పదవులకు ఒకొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావటం తో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది…. iju అధ్యక్షుడు కే. శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు s n సిన్హా ల సమక్షం లో వారు నామినేషన్ లు దాఖలు చేశారు.. apuwj అధ్యక్షుడు ఐ. వి. సుబ్బారావు కార్యక్రమానికి హాజరై సోమసుందర్ గారితో నామినేషన్ వేయించారు. కార్యక్రమంలో tuwj అధ్యక్షుడు విరాహత్ ఆలీ, iju ఉపాధ్యక్షుడు అమర్ మోహన్, బిహార్ రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి కమల్ కాంత్ సహాయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు