Homeఆంధ్రప్రదేశ్అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాట

అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాట

- Advertisement -

అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారు … సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాటమాట్లాడుతున్నారని, అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం సీఆర్‌ భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు పీ రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే సంపదసృష్టించి అభివృది ్ద చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తరువాత ఈ 17నెలల కాలంలో రెండులక్షల 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. అప్పులు చేసి పప్పులు బెల్లంగా పంచుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని పరిశ్రమలు స్థాపించారో, ఎన్ని ఉత్పత్తులు పెంచారో , ఎంత సంపద సృష్టించారో సమాదానం చెప్పగలరా అని ప్రశ్నించారు.కడపలో జరిగిన మహానాడులో కడప స్ట్రీల్‌ ప్లాంట్‌ ఎటువంటి అడ్డంకులు లేవు చేస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదన్నారు. పరిశ్రమల పేరుతో భూములు కార్పొరేట్‌కు దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 19పైసల చొప్పులు కట్టపెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు వలన ఎంత మందికి ఉపాధి వస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తే సమాదానం లేదన్నారు.అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం షిర్డిసాయి కెంపెనీకి భూములు కేటాయిస్తే వ్యతిరేఖించి సీఎం నేడు అదే షిర్డిసాయి కంపెనీకి 8600 ఎకరాల భూములు ఏలా కట్టపెట్టారని ప్రశ్నించారు. భూ బ్యాంక్‌ పేరుతో నియోజకవర్గంకు లక్ష ఎకరాలు గుర్తించి దాంతో రియలెస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు. రాజదానికి మొదట 33 వేల ఎకరాలు తీసుకుని మరో 54వేల ఎకరాలు భూసేకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. మూడుపంటలు పండే భూములను ఇలా చేయడం వలన రాబోయో రోజుల్లో ఆహార కొరత ఏర్పడుతుందన్నారు.అమరావతిలో రైల్వేస్టేషన్‌కు 1600 ఎకరాలు, విమానాశ్రయంకు 4వేల ఎకరాలు కావాలని భూసేకరణ చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అవసరమైన రైల్వేబోగీలు లేక ఇబ్బందులు పడుతుంటే అవి ఏర్పాటు చేయకుండా జిల్లాకో విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ వారికి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబానాయుడు మోడీని పొడుగిడితే , మోడీ లోకేష్‌ను పొగడుతున్నారని ఎద్దెవ చేశారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాదాన్యతా క్రమంలో పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటి సీఎం పవన్‌కళ్యాన్‌ అధికారంలో లేని సమయంలో కర్నూలులో సుగాలీ ప్రీతీబాయి కేసు సీబీఐ ఇవ్వాలని డిమాండ్‌ చేసి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో గృహాలు వెంటనే పంపిణీచేయాలని, ఎన్నికల ఇచ్చిన హామీమేరకు గ్రామీణప్రాంతాలో మూడుసెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండుసెంట్ల స్థలం పేదలకు పంపిణీచేయాలన్నారు.సీపీఐ పరిశ్రమలకు వ్యతిరేఖం కాదని పరిశ్రమల పేరుతో చేస్తున్న దోపిడిని వ్యతిరేఖిస్తామన్నారు. రాబోయో రోజుల్లో కూటమి ప్రభుత్వం అవలం బిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై సమరశీల పోరాటాలు చేస్తుందని ,సీఎం చంద్రబాబునాయుడు చేబుతున్న కల్లబొల్లి మాట నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌ మునెప్ప, ఎన్‌ లెనిన్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జగన్నాధం, రామకృష్ణారెడ్డి, కారుమంచి, విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు