Homeజిల్లాలుఏలూరు'మార్పు' కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి…

‘మార్పు’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి…

- Advertisement -

ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన వారు మళ్ళీ నాటుసారా తయారీకి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి…

లబ్దిదారులకు రుణాలు అందించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), సొంగా రోషన్ కుమార్ లు….

జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి….

             విశాలాంధ్ర ఏలూరు: జిల్లాలో నాటుసారా తయారీ నుండి బయటకు వచ్చిన కుటుంబాలకు 'మార్పు' కార్యక్రమం ద్వారా నవోదయం-2 కి  'మార్పు'  కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధితో  జిల్లా  యంత్రాంగం అందించిన  గౌరవప్రదమైన జీవితంను  సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం నవోదయం-2 లో 'మార్పు' కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి  కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా రూపొందించేందుకు     నాటుసారా తయారీదారులను ఆ వృత్తి నుండి బయటకు తీసుకువచ్చి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. "మార్పు"  మొదటి దశలో  40 కుటుంబాలకు 31. 40 లక్షల రూపాయలు అందించామని,   రెండవ విడతలో 26 కుటుంబాలకు 19 లక్షల రూపాయలు అందించి,  కిరాణా, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు ఏర్పాటుచేయించి వారికి ఆర్ధిక భద్రత కల్పించి, వారి కాళ్లపై వారు  నిలబడే విధంగా పునరావాస  చర్యలు తీసుకున్నామన్నారు.జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు, చేయూతతో జిల్లాలో ఎక్కడా కూడా  అక్రమ మద్యం,నాటు సారా తయారీదార్లు వాటి  జోలికి వెళ్లకుండా గౌరప్రదమైన  జీవితం సాగిస్తున్నారన్నారు.   సమస్య మూల కారణాన్ని తొలగించేందుకు, సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం  తీసుకుని చర్యలతో  సత్ఫలితాలను సాధించామని కలెక్టర్ చెప్పారు.  నాటుసారా తయారీ నుండి బయటకు వచ్చిన కుటుంబాలు మళ్లీ నాటుసారా తయారీ చేపడితే వారి రుణాలను రద్దు చేయడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేస్తామన్నారు.ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన కుటుంబాలతో తాము  మళ్ళీ నాటుసారా తయారీ చేపట్టబోమని, ప్రభుత్వం అందించిన సహకారంతో గౌరవప్రదంగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ మానివేసి, ప్రత్యామ్నాయ ఉపాధి పొందేందుకు అంగీకరించిన  26 కుటుంబాలకు 19 లక్షల రూపాయలు రుణాలను జిల్లా కె. వెట్రిసెల్వి, ఏలూరు, చింతలపూడి ఎమ్మెల్యే లు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), సొంగా రోషన్ కుమార్ లు అందించారు.కార్యక్రమంలో ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్,  ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన వారు తాము పొందిన రుణాలతో ఏర్పాటుచేసుకున్న యూనిట్లు ద్వారా అభివృద్ధి సాధించిన వివరాలు,తమ పిల్లలకు విద్య,గౌరవప్రదమైన జీవితం గురించి తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు