Friday, December 27, 2024
Homeజిల్లాలుఅనంతపురంఅంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

విశాలాంధ్ర -అనంతపురం : అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు సిపిఎం జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప ఎస్ యు సి ఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏసురత్నం సిపిఐ జిల్లా సహా కార్యదర్శి నారాయణ స్వామి సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు రామీ రెడ్డి బాల రంగయ్య రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమణయ్య సంతోష్ కుమార్ అలిపిర పాల్గొన్నారు. ఈనెల 30వ తేదీన సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ సిపిఐ న్యూ డెమోక్రసీ ఎస్యుసిఐ ఆధ్వర్యంలోఅంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బర్తరఫ్ చేసి బిజెపి ప్రభుత్వం దేశానికి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని ఈ కార్మిక ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ కోరారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… అంబేడ్కర్ స్ఫూర్తి బాటలో నడిచే కోట్లది మందిని అమిత్ షా అవమానించారని, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదలకు అంబేడ్కర్‌ ఆయన జీవన విధానం ఆదర్శంనీ అలాంటి నేతను అవమానించిన అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధానిని ఆయన డిమాండు చేశారు. లేదంటే అమిత్‌ షానే స్వయంగా వైదొలగాలని స్పష్టం చేశారు. బాబాసాహెబ్‌ సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. ‘బాబాసాహెబ్‌ రాజ్యాంగ నిర్మాత. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నేతనీ, దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక అంశాలను బిజెపి పరేపిస్తుదని దానికి మణిపూర్ సంఘటన ఉదాహరణమని మణిపూర్‌లో గత ఏడాదికి పైగా జరుగుతున్న తీవ్ర హింసాత్మక పరిస్థితులను వాటిని అదుపు చేయడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని ఆరోపించారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఎన్డీఏది అని ఎద్దేవా చేశారు.పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ మాట్లాడుతూ “పదేపదే అంబేద్కర్ అని ఎందుకంటారు? అంబేద్కర్కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళ్తారు” అని వ్యాఖ్యానించడం దుర్మార్గం అని పేర్కొన్నారు. అమిత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే దురుద్దేశ్యంతో మోడీ, అమిత్ షా నేతృత్వంలో మతవాదాన్ని నెత్తికెత్తుకుని బిజెపి పాలకులు వ్యవహరిస్తున్నారు అని తెలిపారు. కేంద్రంలో బిజెపికి స్వంతంగా మెజారిటీ రాకపోవడంతో తటపట ఇస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో ఫెడరల్ స్పూర్తికి తూట్లుపొడుస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరచిన అమితా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు