Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాఅప్పారావు ఆదర్శప్రాయుడు

అప్పారావు ఆదర్శప్రాయుడు

- Advertisement -

లంకా దుర్గారావు
విశాలాంధ్రవిజయవాడ: ప్రజా పోరాటాలతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఈపి అప్పారావు ఆదర్శప్రాయుడని సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు అన్నారు.గుణదల బుడమేరు కట్ట లెనిన్‌నగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు యువజన గ్రంధాలయం వద్ద డివిజన్‌ కార్యదర్శి అయిత రాజు ఆంజనేయులు అధ్యక్షతన అప్పారావు 3వ వర్ధంతి సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి దుర్గారావు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలోని పలు జిల్లాలను ఉపాధికోసం వలస వచ్చి బుడమేరు కట్టపై ఉంటున్న ప్రజలకు శాశ్వత నివేశ స్ధలాలు కోసం అప్పారావు అలుపెరగని పోరాటం చేసి స్ధలాలు సాధించారని తెలిపారు. తుదిశ్యాస వరకు 1వ డివిజన్‌ కార్యదర్శిగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజా కళలు పట్ల ఆయనకున్న మక్వుతో స్ధానిక యువకులకు కోలాటం, బేతాళ నృత్యాల శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్ది ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు పొందారని అన్నారు. ఈ సభలో పార్టీ నగర కార్యవర్గ సభ్యులు, డివిజన్‌ ఇన్‌చార్జి కొడాలి ఆనందరావు, నగర ప్రజానట్యా మండలి కార్యదర్శి దోనేపూడి సూరిబాబు, 2వ డివిజన్‌ కార్యదర్శి షేక్‌ ఆలీ, బెవర శ్రీనివాసరావు, పి ప్రసాద్‌, కొండరాతి దేవులు, పప్పుల నరేష్‌, పొగిలి పార్వతి, సైదాబీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు