Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లానేడు పీజీఆర్‌ఎస్‌ అర్జీల స్వీకరణ

నేడు పీజీఆర్‌ఎస్‌ అర్జీల స్వీకరణ

- Advertisement -

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ


విశాలాంధ్రవిజయవాడ: కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఈ నెల 28వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్‌, డివిజన్‌, మునిసిపల్‌, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను వెబ్‌సైట్‌ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్‌ చేయవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు