Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి

పిఆర్ సి కమిషన్ ను వెంటనే ప్రకటించాలి

- Advertisement -

ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి. కే. ముత్యాలప్ప డిమాండ్

విశాలాంధ్ర ధర్మవరం;; పి ఆర్ సి కమిషన్ వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి కే ముత్యాలప్ప డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం ఈనెల 26,27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్మవరం తాలూకా కేంద్రం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రివర్స్ పిఆర్సి తో ఉద్యోగులను ఉపాధ్యాయులను మోసం చేసిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను వంచన చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు పై ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ప్రతిపక్ష నాయకుడి హోదాలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేడు ముఖ్యమంత్రి హోదాలో సిపిఎస్ రద్దు పై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని, సిపిఎస్ ఉద్యోగులను దగా చేయడమే అవుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జులై 2023 నుండి 12వ పిఆర్సి అమలు కావలసి ఉండగా గడువు ముగిసి 30 నెలల దాటిన నేటికీ కనీసం పిఆర్సి కమిషన్ను కూడా నియమించకపోవడం శోచనీయం అని తెలిపారు. కావున వెంటనే 12వ పిఆర్సి కమిషన్ను నియమించి 30 శాతము మద్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరల ఇండెక్స్ ప్రకారం ఆరు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని విడుదల చేయాలి అని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను ప్రజల్లో భాగంగా చూడాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా ఉపాధ్యక్ష్యులు బలరాముడు, రవీంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలని, టెట్ నుండి ఇన్ సర్వీస్ టీచర్లను మినహాయించాలని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, నెలవారి పదోన్నతులు పునరుద్ధరించాలని,ఈ హెచ్ ఎస్ అన్ని రకాల ఆస్పత్రులలో అన్ని రకాల వ్యాధులకు వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, 2025లో బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఈ హెచ్ ఎస్ వర్తింపజేయాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, పదవీ విరమణ ప్రయోజనాలు కూడా వెంటనే చెల్లించాలని, పిఎఫ్ , ఏపీ జి ఎల్ ఐ పేమెంట్ల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర కౌన్సిలర్ వాసుకుమార్ రవికుమార్, సంగీత,క్రిష్ణవేణి, ప్ర త్యేక ఆహ్వానితులు శంకరనారాయణ, హేమంత్ కుమార్ సీనియర్ నాయకులు బయన్న, నాగప్ప, శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాపులు భారాన్ని తగ్గించి బోధనకే పరిమితం చేయాలని, కేజీబీవీ టీచర్లకు ఎం టి ఎస్ వర్తింపచేయాలని, పి.ఎస్ హెచ్ఎం పోస్టులను ఎస్ జి టి లకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి ఖాళీలను భర్తీ చేయాలని, మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణకు మునిసిపల్ ఉపాధ్యాయులనే ఎంఈవోలుగా నియమించాలని, పెన్సిలర్లకు 70 సంవత్సరాలకు 10 శాతం 75 సంవత్సరాలకు 15 శాతము అడిషనల్ క్వాంటం పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షులు శంకరనారాయణ, ధర్మవరం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివానంద, ఈశ్వరయ్య, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపి, అంజినాయక్, రామగిరి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామాంజనేయులు, హరి, సి. కే. పల్లి మండల శాఖ అధ్యక్షులు దుర్గ ప్రసాద్, బత్తలపల్లి మండల శాఖ అధ్యక్షులు గోపాల్, కనగానపల్లి అధ్యక్షులు చంద్రశేఖర్, జగదీష్, తిప్పన్న, కుమార్ వందమంది ఏపీటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు